గడిచిన 24 గంటల్లో దేశంలో 13,052 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా వైరస్ నుంచి కోలుకొని 13,965 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. అలాగే మరో 127 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది.
తాజాగా నమోదైన కేసులతో 1,07,46,183కు చేరాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 1,04,23,125 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1,54,274కు పెరిగిందని చెప్పింది.
ప్రస్తుతం దేశంలో 1,68,784 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా శనివారం 7,50,964 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపిం