Home / SLIDER / ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు

ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు

తెలంగాణ రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుదలలో దేశంలోనే  మొదటి స్థానంలో ఉందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇది కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారానే సాధ్యమయ్యిందని చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లా ఏరియా దవాఖానలో పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 46 కేంద్రాల ద్వారా సుమారు 75 వేల మందికి పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు.

బంగారు తెలంగాణ కావాలంటే పాడి పంటలు మాత్రమేకాదని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అని సీఎం కేసీఆర్‌ ఆరోగ్యరంగం పట్ల అత్యంత శ్రద్ద తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా తల్లీ, బిడ్డల ఆరోగ్యం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బిడ్డ పుట్టినప్పటి నుంచే ఆరోగ్యంగా ఉండాలని.. గర్భిణిగా ఉన్న 6 నెలల నుంచి ప్రసించిన తర్వాత మూడో నెలవరకు ప్రతి నెల రూ.2000 చొప్పున 6 నెలలకు రూ.12 వేలు ప్రభుత్వం ఇస్తున్నదని వెల్లడించారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణీలు, బాలింతలకు అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తున్నదని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat