కరోనా నేపథ్యంలో మూతబడిన విద్యాసంస్థలు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్షబోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
దీంతో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ తెరుచుకోబోతున్నాయి. మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు.
ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెప్తున్నారు.
సమ్మతి తప్పనిసరి..
-
9, 10వ తరగతుల విద్యార్థులే క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.
-
ఇంటర్ కాలేజీల్లో ఒకరోజు ఫస్టియర్, రెండో రోజు సెకండియర్ తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు సమ్మతిపత్రం సమర్పించాలి.
-
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సహా ఇతర వృత్తివిద్యాకాలేజీల్లో రోజుకు 50శాతం మంది విద్యార్థులను అనుమతిస్తారు. తల్లిదండ్రుల కాన్సెంట్.. లేదా విద్యార్థులనుంచి స్వీయ సమ్మతిపత్రంను అంగీకరిస్తారు.
తరగతి వేళలు ఇలా..
-
స్కూళ్లు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు (హైదరాబాద్ జిల్లాలో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 వరకు)
-
జూనియర్ కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు
-
డిగ్రీ ఆపై స్థాయి కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు
Post Views: 313