తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని, ఫ్రంట్ లైన్ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్ తీసుకోవాలని ఉపాసన సూచించారు. మహమ్మారిపై ఒక జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.