మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీ అహింస సత్యాగ్రహం దీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు.
దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్తుందని అన్నారు.