ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పారు అవసరమైతే రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
నిన్న సిద్దిపేట జిల్లాలోని ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్య మంత్రి.. రైతుల నుంచి 4% మాత్రమే కమీషన్ తీసుకోవాలని ఏజెంట్లను ఆదేశించారు దేశవ్యాప్తంగా మద్దతు ధరపై ఆందోళనల నేపథ్యంలో సీఎం ప్రకటన రైతులకు భరోసా కల్పించనుంది