తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,93,737కు పెరిగింది.మహమ్మారితో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 1593 మంది చనిపోయారు.
తాజాగా 399 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 2,89,325కు చేరింది. ప్రస్తుతం 2,189మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా GHMC పరిధిలో 32, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. 8 జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేవు.