తెలంగాణలో వేరుశనగ ధర భారీగా పెరిగింది. గద్వాల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ కు గరిష్ఠంగా రూ.8,376 ధర పలికింది. మద్దతు ధర రూ.5,225ను మించి ఉండటంతో రైతులు సంబరపడుతున్నారు.
వనపర్తి మార్కెట్లో గత ఏడాది రూ.3,500 నుంచి రూ.5,000 లోపు ఉన్న వేరుశనగ ఈ ఏడాది ఏకంగా రూ.7,942 పలుకుతోంది. ఇక్కడి వేరుశనగకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. గతేడాది భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి