సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిలను ఎరవేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సైబరాబాద్ CP సజ్జనార్ హెచ్చరించారు. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్ చేయిస్తూ అబ్బాయిలను ముగ్గులోకి దించుతున్నారని చెప్పారు.
రెచ్చగొట్టి బట్టలు విప్పించి, ఆ వీడియోను రికార్డు చేస్తారని తెలిపారు. ఆ వీడియోను బాధితులకు పంపించి.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు