దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోమారు తన సత్తాను చాటింది. మార్కెట్ విలువలో దేశీయ అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కినెట్టి టీసీఎస్ తొలి స్థానం సాధించింది.
రూ.12,34,609.62 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో టీసీఎస్ ఈ సత్తా చాటింది. రూ.12,29,661.32 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. ఇంట్రాడేలో 1.26 శాతం పెరిగిన టీసీఎస్ షేరు ధర చివరకు 0.40 శాతం నష్టంతో రూ.3,290.20 వద్ద ముగిసింది. ఇదే సమయంలో ఆర్ఐఎల్ షేరు 5.36 శాతం పతనం చెంది రూ.1,939.70 వద్ద నిలిచింది.
గతేడాది మార్చిలో తన తొలి స్థానాన్ని కోల్పోయిన టీసీఎస్..మళ్లీ పది నెలల తర్వాత తిరిగి చేజిక్కించుకున్నది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలో టీసీఎస్ అగ్రగామికి చేరుకున్నది. ఇప్పటి వరకు 168.44 బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచిన యాక్సెంచర్‌ను టీసీఎస్ 169.20 బిలియన్ డాలర్లతో వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నది.
మార్కెట్ విలువలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు
ర్యాంకింగ్ కంపెనీమార్కెట్ క్యాప్స్టాక్
(బిలియన్ డాలర్లలో)ఎక్సేంజ్
1టీసీఎస్169.2బీఎస్ఈ
2యాక్సెంచర్168.4ఎన్వైఎస్ఈ
3ఎస్ఏపీ155.5ఎన్వైఎస్ఈ
4ఐబీఎం105.6ఎన్వైఎస్ఈ
5ఇన్ఫోసిస్77.28బీఎస్ఈ
6కాగ్నిజెంట్43.07నాస్డాక్
7హెచ్‌సీఎల్ 35.25బీఎస్ఈ
8విప్రో34.15బీఎస్ఈ
9క్యాప్‌జెమినీ25.05ఈపీఏ
10ఈపీఏఎం 20.14ఎన్వైఎస్ఈ