Home / SLIDER / సచివాలయ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్

సచివాలయ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్

నూతన సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవనాల నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగారు. నిర్మాణ పనుల్లో నిమగ్నమైవున్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు.

నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సెక్రటేరియట్ ప్రధాన గేట్ తో పాటు,ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలతో సహా, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కలియ తిరగారు. డిజైన్లను పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి వెంట ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఇ ఎన్ సి గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat