ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులను సహకరించకుండా చేస్తూ వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గుర్తించాలని సూచించారు. నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొనమని చెప్పటం సరికాదని మండిపడ్డారు. స్థానిక పాలన అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు