తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు