జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది.
రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.