అమెరికా 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వందల ఏళ్లనాటి పురాతన ఫ్యామిలీ బైబిల్ సాక్షిగా బైడెన్ ప్రమాణం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ తో ప్రమాణం చేయించగా.. బైడెన్ కంటే ముందు వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు.
బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి క్లింటన్, ఒబామా, జార్జ్ బుష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జోబైడెన్ మాట్లాడారు. ‘అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉంది. అమెరికా ఎన్నో సవాళ్లను అధిగమించి ఎదిగింది.
ఇటీవల పార్లమెంట్ పై దాడి బాధాకరం. ప్రజాస్వామ్యం అత్యంత విలువైందని అమెరికా నమ్మింది. మంచి ప్రపంచం కోసం మనమందరం పాటుపడదాం హింస, నిరుద్యోగం, ఉగ్రవాదం లాంటి సవాళ్లను అధిగమించాలి. ఈ ప్రయత్నంలో మీ సహకారం కావాలి. USలో కొత్త శకం మొదలైంది’ అని అన్నారు.