తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తన ఆస్తి తాకట్టు పెట్టారు. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం . అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో-ఆపరే టివ్ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన ఆస్తిని బ్యాం కుకు తాకట్టు పెట్టారు.
దీంతో ఇప్పుడు వారికి రుణాలు సులభంగా అందనున్నాయి. గురువారం సిద్దిపేటలో హరీశ్ రావు చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు, డ్రెస్సులు అం దించనున్నారు. వందలాది మంది ఉపాధి కోసం ఆటోలు తీసుకొని కాలం వెళ్లదీస్తుండగా కరోనాతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. రోజువారీ ఫైనాన్స్ ను తీసుకుంటూ ఆటో నడ పగా వచ్చిన మొత్తాన్ని మిత్తీలకే చెల్లించుకుంటూ మళ్లీ అప్పుల పాలవుతున్నారు.
ఇదంతా గమనించిన మంత్రి హరీశ్ రావు 2019 అక్టోబరులో సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇందులో సభ్యుల సంఖ్య 850కి చేరింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆటో ఆర్ నే తదితర అంశాలు అర్హ తగా ఎంత మంది వచ్చినా సభ్యులుగా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది.