ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా సెలవులు ఉండవని పేర్కొంది. కరోనాతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు జనవరి 18 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి..