హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం (CDS) ను భవన నిర్మాణాన్ని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్..
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ
అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సెంటర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఈ సెంటర్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. ఇలాంటి అద్భుతమైన సెంటర్ ను అందించిన సీఎం కెసిఆర్ గారికి దళిత వర్గాల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
?స్వాతంత్య్రం అనంతరం భారతదేశం సాధించిన ఏ సామాజిక పురోగతిని డాక్టర్ భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్ నేరుగా ఆపాదించవచ్చని చెప్పడం సాధారణ విషయం కాదు.
?అంబేద్కర్ గారు రూపొందించిన జ్ఞానోదయ రాజ్యాంగం దేశంలో అట్టడుగున ఉన్నవారికి అధికారం ఇచ్చింది.
?ఎస్సీ,ఎస్టీ యువతకు సీ.డీ.ఎస్ వల్ల మేలు జరుగుతుందన్నారు.
?ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం సీడీఎస్ ప్రాంగణంలో ఉండటం గర్వంగా ఉన్నదన్నారు.
?ప్రపంచంలో 27.6 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఎక్కడాలేదు అన్నారు.
?భవిష్యత్‌లో ఈ భవనానికి మంచి గుర్తింపు రావడం ఖాయమని చెప్పారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ గారు ఎంతో చొరవ చూపారని వివరించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్పులు బాల్క సుమన్ గారు, గువ్వల బాలరాజు గారు, ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే లు ఆత్రం సక్కు గారు, కాలే యాదయ్య గారు. తదితరులు పాల్గొన్నారు.