స్లిమ్‌గా కనిపించేందుకు రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తూ వచ్చిన తమన్నా కరోనా వలన కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంది. తరచు వర్కవుట్స్ చేసే వాళ్ళు మధ్యలో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావడం సహజమే.
మెడికేషన్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడడం వలన తమ్మూ లావైపోయింది. ఆ మధ్య బొద్దుగా మారిన తమన్నాని చూసి చాలా మంది షాకయ్యారు కూడా.
అయితే పాత రూపంలోకి మారేందుకు తమన్నా జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తుంది. ఖాళీ దొరికనప్పుడల్లా జిమ్‌కే పరిమితమవుతూ చెమటలు కారుస్తుంది. తాజాగా పొట్టి దుస్తులలో తమన్నా చేస్తున్న వర్కవుట్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం తమన్నా సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాల కోసం రెడీ అవుతోంది.