కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు.
పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు