తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ తర్వాత రియాక్షన్ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రజలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించే బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.
ముందుగా ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసు, భద్రతా బలగాలకు టీకా వేయనున్నారు. ఆ తర్వాత 50ఏండ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తారు.