గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభమైంది. రహ్మత్‌నగర్‌లోని ఎస్పీఆర్ హిల్స్‌లో ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ మహముద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మాగంటి గోపినాథ్, శ్రీ దానం నాగేందర్, శ్రీ ముఠా గోపాల్, శ్రీ వివేకానంద, ఎమ్మెల్సీ శ్రీ యెగ్గె మల్లేశం, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ శ్రీ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు