తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.