ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. భువనేశ్వర్, దిల్లీ, ఫరీదాబాయ్లో తన తండ్రి, మాజీ సీఎం బీజు పట్నాయక్ ద్వారా లభించిన ఆస్తులు.. తాను రచించిన పుస్తకాల రాయల్టీ ద్వారా సంపాదించిన మొత్తం 2020 మార్చి నాటికి సుమారు రూ 63 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయా వివరాలను త్వరలో లోకాయుక్తకు అందజేస్తానని చెప్పిన ఆయన.. తన మంత్రివర్గంలోని పలువురి ఆస్తులను సైతం ప్రకటించారు
