Home / SLIDER / త్వరలోనే సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ

త్వరలోనే సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 651 ఉద్యోగాలను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు.

వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు చెప్పారు. కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్‌ ట్రెయినీలు, మిషన్‌ ట్రెయినీలు, మోటార్‌ మెకానిక్‌, మౌల్డర్స్‌ పోస్టులున్నాయి.

అధికారుల స్థాయిలో పర్సనల్‌ ఆఫీసర్లు, మెయిన్‌మేంట్‌ ట్రెయినీలు, వివిధ జూనియర్‌ ఫారెస్ట్‌ అధికారుల పోస్టులున్నాయి. వీటితో పాటు జూనియర్‌ స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్‌లు తదితర వైద్య సిబ్బందిని సైతం త్వరలోనే నియమిస్తామని చెప్పారు. ఇవేకాకుండా త్వరలో అంతర్గత సిబ్బందితో 1,436 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat