ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కష్టాల్లో పడింది.ఈ సిరీస్ లో హనుమ విహారి(4) మరోసారి నిరాశపరిచాడు.
హనుమ విహారి అవుట్ అవ్వడంతో టీమిండియా 142పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పుజారా (34),పంత్ (4)క్రీజులో
ఉన్నారు.
ప్రస్తుతం టీమిండియా అరవై తొమ్మిది ఓవర్లకు 146/4 పరుగుల వద్ద ఉంది. ప్రస్తుతం టీమిండియా 192పరుగుల వెనుకంజలో ఉంది. మరోవైపు ఆసీస్ ఆటగాడు స్మిత్ 131 రాణించడంతో ఆ జట్టు 338పరుగుల వద్ద ఆలౌట్ అయింది.