తెలంగాణ రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దోమలగూడలో జోనల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం పనులకు, నారాయణగూడలో మోడ్రన్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.