తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. కరోనా సమయంలో మొట్టమొదటి స్టార్ హీరో సినిమాగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రాక్ మూవీ విడుదల ఆగిపోయింది.
ఈ రోజు శనివారం విడుదల కానున్న క్రాక్ మూవీ షోలు రద్ధు అయ్యాయి.ఈ మూవీ నిర్మాత ఠాగూర్ మధు చెల్లించాలని బకాయిలను చెల్లించకపోవడంతో స్క్రీన్ సీన్ మీడియా కోర్టును ఆశ్రయించింది.
దీంతో వాదనలు విన్న కోర్టు క్రాక్ మూవీ షోలు రద్దు చేయాలని తీర్పునిచ్చింది. మార్నింగ్ షోలే కాకుండా మధ్యాహ్నాం షోలు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. షోలు రద్దు అవ్వడంతో అన్ లైన్ బుకింగ్ కూడా ఆగిపోయింది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్నవాళ్లకు రీఫండ్ చేస్తామని మెసేజులు వస్తున్నాయి.