ఇటీవల ‘లవ్‌స్టోరి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నాగచైతన్య.. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ పేరుతో సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడట.
ఇంతకీ నాగచైతన్య ఏ హీరో అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడో తెలుసా…!. సూపర్‌స్టార్ మహేశ్ అభిమాన సంఘానికి. ఇందులో నాగచైతన్య పేరు అభిరామ్. ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందిస్తున్నారు. మనం తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో థాంక్యూ సినిమా తెరకెక్కుతోంది.