ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన ఈరోజు(మంగళవారం) చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది.
లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్, సమరసింహారెడ్డి, శీను, టక్కరిదొంగ, పెళ్లైన కొత్తలో, పెంగ్విన్ వంటి ఎన్నో చిత్రాలకు ఆయన లిరిసిస్ట్‌గా వర్క్ చేశారు.
పంచతంత్రం, పోతురాజు, దశావతారం, మన్మధబాణం వంటి డబ్బింగ్ చిత్రాలకు ఆయన డైలాగ్స్ రాశారు. వెన్నెలకంటి ఇద్దరు తనయులు కూడా సినిమా పరిశ్రమలో మంచి పేరును పొందారు. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేస్తుంటే.. మరో తనయుడు రాకేందు మౌళి లిరిసిస్ట్, సింగర్ మరియు నటుడిగా గుర్తింపును పొందారు.