తెలంగాణలో నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం టీ సేవ ఆన్‌లైన్ కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీ సేవ సంస్థ డైరెక్టర్ ఆడపా వెంకట్ రెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
టికెట్ల బుకింగ్, కొత్త పాన్‌కార్డు, వివిధ టెలికాం పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జులు, మనీ ట్రాన్స్‌ఫర్ల వంటి వివిధ రకాల సేవలను టీ సేవలో అందించాలని తెలిపారు. వివరాలకు 8179955744 లేదా www.tsevacentre.comలో సంప్రదించాలని సూచించారు.