తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియా యాక్టివ్ కార్యకర్తల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి పార్టీ ఆఫీసు ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళి,నగర సోషల్ మీడియా కన్వీనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దినేశ్ చౌదరి మాట్లాడుతూ “తెలంగాణ ఏర్పడిన అన్ని వర్గాల అభివృద్ధికై సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది.యువమంత్రి వర్యులు కేటీఆర్ నాయకత్వంలో టీహాబ్,టీఎస్ఐపాస్ ద్వారా కొన్ని వేల కంపెనీలకు హైదరాబాద్ కు రప్పించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో సఫలీకృతమవుతున్నారు..
జాతీయ పార్టీలు అని చెప్పుకునే బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు అసత్యప్రచారాలు చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నాయని అన్నారు..ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బీజేపీ,కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎలా తిప్పికోట్టాలి.. ప్రతిపక్ష నేతలకు ఎలా కౌంటరివ్వాలి.. ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు..