ఏపీలో సంక్రాంతి పండుగ తర్వాత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను సీఎం నేరుగా కలుస్తారు..
త్వరలోనే ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో పాల్గొన్న ఆయన.. పేదల కోసం చేస్తున్న మంచి పనులను కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.