తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ ప్రగతిభవన్ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలిసి మొక్క అందించారు.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, ఐటీ పార్క్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ను కోరుకంటి కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం రామగుండంలో నిర్మించనున్న ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల విషయమై మంత్రితో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని మంత్రిని కోరానన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవితకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో, ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్సీ నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.