ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు స్థాయికి మించి సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు.
కేసీఆర్‌ను జైల్లో పెట్టేంత ధైర్యం ఉందా.. తెలంగాణ ను అభివృద్ధి చేస్తున్నందుకు జైల్లో పెడ్తారా? అని సూటిగా ప్రశ్నించారు.
రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండటం తప్పా అని ప్రశ్నించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తామని రైతులను మోసం చేసి, రైతు పక్షపాతి కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతా? నిన్ను, మీ పార్టీని రైతులు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.