ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది. ఇందులో 2,43,953 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతుండగా, 99,46,867 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారు.
మరో 1,49,649 మంది బాధితులు మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 19,557 మంది డిశ్చార్జీకాగా, 214 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 96.19 శాతం, మరణాల రేటు 1.45 శాతంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో జనవరి 3 వరకు 17,56,35,761 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒకేరోజు 7,35,978 నమూనాలకు పరీక్షలు చేశామని వెల్లడించింది.