తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్, కొషీ రోల్స్ చేస్తున్నారు పవన్-రానా.
అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యరాజేశ్ దాదాపు ఖరారైనట్టు టాక్. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ సతీమణి పాత్రలో కోలీవుడ్ బ్యూటీ సాయిపల్లవిని మేకర్స్ అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. సాయిపల్లవి ఈ చిత్రం కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.
కథానుగుణంగా భార్యల పాత్రలు ముఖ్యమే అయినా వారి పాత్ర నిడివి సినిమాలో ఎక్కువగా ఉండదట. సాయిపల్లవి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుండటంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారంటూ మరో న్యూస్ హల్చల్ చేస్తోంది.
అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సాగర్ కే చంద్ర తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై సాయిపల్లవి-పవన్ కాంబినేషన్ సందడి చేస్తుందా..? లేదా అన్న దానిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.