అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో కారు.. గులాబీ జెండా.. కేసీఆర్ మాత్రమే ఉన్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని త్రీ టౌన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందల కోట్ల రూపాయలతో ఖమ్మం నగరాన్ని ఆధునీకరించామని పేర్కొన్నారు.
రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, పార్క్‌ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలతో ఖమ్మం నగరం కొత్త శోభను సంతరించుకుందన్నారు. ఏ పార్టీకి కూడా ఖమ్మంలో స్థానం లేదని.. కేవలం గులాబీ జెండా మాత్రమే ప్రతిచోట ఎదుగుతుందన్నారు.
ఒకప్పుడు వెనుకబాటుకు గురై ప్రాంతాలు ప్రస్తుతం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన అన్నారు. ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని.. ప్రతి అభ్యర్థి గెలుస్తాడని ఆయన పేర్కొన్నారు.