టాలీవుడ్ స్టార్ హీరో పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
కౌసల్యకృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్యరాజేశ్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ను ప్రేమించే ఓ గిరిజన యువతిగా ఐశ్వర్య రాజేశ్ గా కనిపించనుందట.
పవన్ కల్యాణ్ సినిమాలో ఈ బ్యూటీని హీరోయిన్ గా ఫైనల్ చేశారా..? లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వేణుశ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్‌సాబ్ చిత్రషూటింగ్ ఇటీవలే పూర్తి చేశాడు పవన్‌కల్యాణ్. త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.