ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్ తేజది ప్రత్యేకమైన శైలి. ఈ దర్శకుడు ప్రస్తుతం అలివేలు వెంకటరమణ అనే చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుందని మొదట ఫిక్స్ అయ్యాడు తేజ.
అయితే ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. కాజల్ స్థానంలో తాప్సీని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మహిళాప్రధాన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది తాప్సీ. ఈ ప్రాజెక్టుకు తాప్సీ అయితే బాగుంటుందని తేజ్ అనుకుంటున్నాడట.
తేజ ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా..రానున్న రెండు నెలల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. మరోవైపు తాప్సీ కూడా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ పూర్తవగానే తేజ సినిమాతో జాయిన్ అయే అవకాశాలున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.