ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకానికి రంగం సిద్ధం చేస్తంది. రెండో విడతలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దాదాపు 45లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
ఈనెల 9న రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ నందు శ్రీవేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.
సభలోనే బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వం తెలిపింది. పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణను పూర్తి చేసింది. ప్రభుత్వం ఖజానాలో ఉన్న నిధులతో పాటు ఇతర మార్గాల నుంచి సమీకరించినట్లు ఆర్ధిక శాఖ అధికారులు తెలిపారు.