తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు క్రిష్ కు కూడా కరోనా వచ్చింది. ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు పవన్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఈ చిత్రం కోహినూర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ చిత్రం కోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు నిర్మాత ఏఎం రత్నం. ఈ సినిమా షూటింగ్ కోసం అప్పట్లో 15 రోజులు డేట్స్ ఇచ్చాడు పవన్. అది పూర్తైన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు.