Home / SLIDER / తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు

తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బీ వరప్రసాద్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్‌కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు.

తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ నెల 22 నుంచి 24 వరకు నడిపే బస్సుల్లో సీట్లు బుక్‌ చేసుకొనేందుకు ప్రయాణికులు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. సందేహాలకు ఎంజీబీఎస్‌-83309 33537,జేబీఎస్‌ 040-27802203 నంబర్లలో సంప్రదించవచ్చని ఆర్‌ఎం వెల్లడించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat