డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు.
వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు