తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కల్లూరు మండలం పోచారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మధిరలో సీపీఎం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ విధానాలు నాయకుల తీరు నచ్చక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.