తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రస్తుతం 60 శాతం బస్సులే తిరుగుతుండగా పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ నెల 20 నుంచి వంద శాతం బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ ఆర్టీసికి 3,750 బస్సులుండగా లాక్ డౌన్ అనంతరం కేవలం 1,650 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. రోజూ 16-17 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ మధ్య రద్దీ పెరగడంతో వంద శాతం బస్సులు తిప్పనున్నారు.