Home / MOVIES / 2020లో నేలరాలిన బాలీవుడ్ సినీ తారలు వీళ్ళే..?

2020లో నేలరాలిన బాలీవుడ్ సినీ తారలు వీళ్ళే..?

ఈ ఏడాది  అగ్ర తారల మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా,  యువహీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో బలవన్మరణానికి పాల్పడటం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరోజ్‌ఖాన్‌, భాను అథయా వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని కోల్పోవడం పూడ్చలేని లోటును మిగిల్చింది. సూపర్‌హీరో పాత్ర ద్వారా ప్రపంచానికి సుపరిచితుడైన చాడ్విక్‌ బోస్‌మన్‌ అర్థాంతర నిష్క్రమణం సినీ ప్రియులకు విషాదాన్ని మిగిల్చింది.

ఇర్ఫాన్‌ ఖాన్‌ 

 బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 29న మరణించారు. ఆయన ‘న్యూరో ఎండోక్రైన్‌ ట్యూమర్‌’ అనే అరుదైన క్యాన్సర్‌ బారిన పడ్డారు. అమెరికాలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తనదైన ముద్రవేసిన ఇర్ఫాన్‌ మరణం దేశ ప్రజలను షాక్‌కు గురిచేసింది.

సుశాంత్‌సింగ్‌ 

దేశాన్ని షాక్‌కు గురిచేయడంతోపాటు అత్యంత వివాదాస్పదంగా మారిన మరణం సుశాంత్‌సింగ్‌ది. బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదుగుతూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్న 34 ఏండ్ల సుశాంత్‌.. జూన్‌ 7న తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించాడు. అతడిది హత్యో.. ఆత్మహత్యో తేల్చేందుకు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. అయితే సుశాంత్‌ మరణంతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం డొంకలు కదిలాయి. మరోవైపు నెపోటిజంపై (వారసత్వం) పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది.

రిషి కపూర్‌ 

బాలీవుడ్‌ వెటరన్‌ యాక్టర్‌ రిషికపూర్‌ 67 ఏండ్ల వయసులో ఏప్రిల్‌ 30న అనారోగ్యంతో కన్నుమూశారు. ఐదుదశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో అజరామరమైన చిత్రాలతో రొమాంటిక్‌ హీరోగా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయారు.

చిరంజీవి సర్జా

కన్నడ సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోగా ఎదుగుతున్న నటుడు. వరుసగా సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తున్న తరుణంలోనే గుండెపోటుతో జూన్‌ 7న మరణించారు. అప్పటికి ఆయన భార్య గర్భిణి. ఆమె సర్జా కటౌట్‌ సమక్షంలో శ్రీమంతం చేసుకోవడం అందరినీ కదిలించింది.

సరోజ్‌ఖాన్‌

ఎంతో మంది బాలీవుడ్‌ నటులను తన నాట్యంతో సెలబ్రెటీలుగా మార్చిన కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ అనారోగ్యంతో జూలై 3న మరణించారు.

చాడ్విక్‌ బోస్‌మన్‌

సూపర్‌ హీరో పాత్ర ‘బ్లాక్‌ పాంథర్‌’తో ప్రపంచానికి సుపరిచితుడు. ప్రతిభాశాలి. కొన్నాళ్లుగా ఆయన క్యాన్సర్‌తో పోరాడారు. 43 ఏండ్ల వయసులో ఆగస్టు 28న కన్నుమూశారు. మరో హాలీవుడ్‌ ప్రముఖుడు, జేమ్స్‌ బాండ్‌ పాత్రధారి సీన్‌ కానరీ అక్టోబర్‌ 31న తుదిశ్వాస విడిచారు.

వీరితోపాటు బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌, భారత తొలి ఆస్కార్‌ విన్నింగ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ బాను అథ యా తదితరులు ఈ ఏడాది మరణించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat