తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రెండోరోజు రెండెకరాల వరకు భూమి కలిగిన పట్టాదారులు 14.69 లక్షల మంది ఖాతాల్లో రూ. 1,125.31 కోట్లు జమచేశారు.
తొలిరోజు ఎకరంలోపు భూమిఉన్న 16.04 లక్షల మంది రైతులకు రూ.494.11 కోట్లు అందజేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో మొత్తం 30.73 లక్షల మంది పట్టాదారులకు రూ.1,619.42 కోట్లు పంపిణీ చేసింది.
బుధవారం మూడెకరాల భూమి గల పట్టాదారుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నారు. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో తొలి రెండురోజుల్లో రైతుబంధు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు