ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 8,81,273కు చేరింది.
7,098 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 3,423 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 8,70,752 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. కాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.