మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనకు కరోనా పాజిటీవ్ . తనను కల్సినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి విదితమే.
అయితే ఇప్పుడు ఈ అంశమే మెగా కుటుంబంలో కరోనా కలవరం సృష్టిస్తుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకలు మెగా హీరో రామ్ చరణ్ ఇంట్లో ఘనంగా జరిగిన సంగతి విదితమే.
ఈ వేడుకలు స్టార్ హీరో అల్లు అర్జున్ దగ్గర నుండి అల్లు శిరిష్ వరకు..కొణిదెల ఉపాసన దగ్గర నుండి సుస్మిత వరకు మెగా కుటుంబానికి చెందిన అందరూ ఈ వేడుకలకు హజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న రామ్ కు కరోనా పాజిటీవ్ కావడంతో వీరిలో కరోనా కలవరం మొదలైంది. చూడాలి మరి వీరంతా కరోనా పరీక్షలు చేస్తే ఫలితం ఏమి వస్తుందో..?
Post Views: 366